ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 27 :
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో “మన ఓటు – మన గొంతుక” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఫౌండర్ చైర్మన్ డా. చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతీ తెలంగాణ ఉద్యమకారుడు రాబోయే గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.డిగ్రీ అర్హత కలిగిన ప్రతి విద్యావంతుడు, వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులకు MLC ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమకారుల గొంతుక శాసన మండలిలో వినిపించాలంటే ఉద్యమకారులు ఐక్యంగా ఉండి ఉద్యమకారుడినే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.నేడు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులను విస్మరిస్తూ, కార్పొరేట్ వర్గాలకు, ధనవంతులకు, ఉద్యమంలో లేని వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ MLC ఎన్నికల్లో ఉద్యమకారులకు మద్దతుగా ఉండాలని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఓటును అమ్ముకోవద్దని, ధనస్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత విద్యావంతులపై ఉందని అన్నారు. విద్యావంతులు కూడా ఓటును అమ్ముకోవడం దురదృష్టకరమని అన్నారు.సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు పని చేయాలని కోరుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో నాయకురాలు.దయానంద్ .జగన్ యాదవ్. జోగు అంజయ్య. భూపాల్ . శ్యామల. మంజూష. కొండా స్వామి.శివకుమార్ నేత. చంద్ర శేఖర్. భాను ప్రకాశ్. సెబాస్టియన్. ముజఫర్.తదితరులు పాల్గొన్నారు.















