EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జవహర్ నగర్ లో డంప్ యార్డు తొలగించే వరకు పోరాటం ఆగదు : పాదయాత్రను ప్రారంభించిన మల్కాజిగిరి ఎంపీ, ఈటల రాజేందర్

ఈకరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 27:

_________________________________

జవహర్ నగర్ లో డంప్ యార్డు తొలగించే వరకు పోరాడడాం- మూడువేల కోట్లు పెడితే సమస్య పరిష్కారం అవుతుంది.రేవంత్ రెడ్డి సమయం కేటాయించి పరిష్కారం కనుక్కోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.జవహర్ నగర్ లో డంప్ యార్డు తొలగించాలని ఫిమందు చేస్తూ మంగళవారంపాదయాత్రను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా జవహార్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జెఎసి ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారు.

డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా, నిబంధనలు పాటించాలని సుప్రీంకోర్టు లక్ష రూపాయల ఫైన్ కూడా వేసింది.నాకంటే ముందు ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంపీగా పనిచేశారు. కోట్లాడే బిడ్డకు ఓటు వేయాలని ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని చెప్పి ఇక్కడి ప్రజలు గెలిపించారు.ఎంపీ గా రేవంత్ రెడ్డి ఎన్జీటీలో, సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు.

ప్రశ్నించే గొంతు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందని భావించాను.. కానీ రెండేళ్లయిన ఎలాంటి స్పందన లేదు.జవహర్ నగర్ కమిటీ గురించి భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉండి కూడా జవహార్ నగర్ డంప్ యార్డు గురించి పార్లమెంటులో ప్రశ్నించాను.కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ కట్టర్ గారిని కలిసి పరిష్కారం చూపించాలని కోరాను.ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ఉందని నమ్మే ప్రధానమంత్రి కాబట్టి..సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అనే మోదీ గారు సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు.

రాష్ట్రం, కేంద్రం కలిసి మెలిసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సంకల్పం చేస్తున్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఫ్లై ఓవర్లు డబ్బులు ఇచ్చింది నరేంద్ర మోదీ గారు.ఆ నమ్మకంతో ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నాను. ప్రధాని ప్రజల సేవకులుగా పనిచేస్తారు. సంకుచిత స్వభావం లేదు.. కాబట్టి 2, 3 వేల కోట్ల రూపాయలు పెడితే జవహర్ నగర్, బాలాజీ నగర్ ప్రజల బ్రతుకులు మారుతాయి. కోట్ల టన్నుల చెత్త పోయే అవకాశం ఉంది కాబట్టి.. దానికి డిపిఆర్ తయారుచేసి ఇవ్వాలని కోరుతున్నాను.ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక్క కేజీ కూడా వ్యర్థం లేకుండా చేయవచ్చు.

ప్లాస్టిక్ తో డాంబర్ తయారు చేసే టెక్నాలజీ వచ్చింది ఉపయోగించుకోండి.తడి చెత్త నుంచి పంట పొలాలకు అవసరమైన ఆర్గానిక్ మ్యానూర్ తయారు చేయవచ్చు.పొడి చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయవచ్చు.ఒక్క కిలో తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ ను తిరిగి వినియోగించే టెక్నాలజీ ఉంది కాబట్టి 3000 కోట్ల రూపాయల ఖర్చుపెట్టి జవహర్ నగర్ డంప్ ను జీరో చేయించండి.

చెరువును నమ్ముకుని బ్రతుకుతున్న మత్స్యకారుల బ్రతుకులు రోడ్డున పడ్డాయి. ఆ నీళ్లు తాగిన గొర్రెలు, మేకలు చచ్చిపోయాయి. పశువులకు అబార్షన్లలవుతున్నాయి. మనుషులకు అబార్షన్లు అవుతున్నాయి.ఈరోజే ఈ గ్రామంలో సుశీల అనే మహిళ క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. మొన్నే 25 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో చనిపోయారు.

ఎదులాబాద్ లోనే పదుల సంఖ్యలో క్యాన్సర్ లతో చనిపోయారు. వందల మందికి క్రానిక్ రెస్పిరేటరీ డిసీస్ వచ్చాయి. ఈ నీళ్లతో స్నానం చేస్తే చర్మ వ్యాధులు వస్తున్నాయి.నీళ్లు, పంట, పాడి, మత్స్య సంపద ఏదీ లేకుండా పోయింది. ఒకప్పుడు పచ్చని పొలాలతో ఉన్న ఎదులాబాద్ మృత్యుకుహరంగా.. మరణ మృదంగం మోగిస్తోంది.

రేవంత్ రెడ్డి మీకు తీరిక లేనట్టుంది జర ఈ ప్రజల బాధలను గురించి పట్టించుకోండి.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 4 రోజులపాటు ఈ పాదయాత్ర చేస్తున్నాం.చివరి రోజు బాలాజీ నగర్ లో పెద్ద సభ పెడుతున్నాము.మీ అందరి మద్దతు ఉంటే ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కొనవచ్చు.

14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో మడమ తిప్పకుండా కొట్లాడాము అదే స్ఫూర్తితో మీ ముందుకు వచ్చాము.సమస్యలు సంపూర్ణంగా అర్థం అయ్యాయి వాటి పరిష్కారం కోసం మేము ఈ పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి బాధితులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తిహ్ చేస్తున్నాము.మనకు అండగా ఉండటానికి Hమల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు ప్రజలు తరలివచ్చారు.ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ప్రజలకు అండగా ఉంటానన్నారు.

Related News

Select the Topic
Scroll to Top