ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 27:
_______________________________
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ క్రీడా శాఖ చేపట్టిన ‘ఖేలో తెలంగాణ’ కార్యక్రమంలో యువత, విద్యార్థులు నిరంతరం పాల్గొనాలని రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా క్రీడలు, ఫిట్నెస్పై అవగాహన కల్పిస్తున్న తెలంగాణ క్రీడా శాఖను ఆయన అభినందించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ముషీరాబాద్ నియోజకవర్గ విద్యార్థులు, యువతకు ఎం. అనిల్ కుమార్ యాదవ్ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు.
జిఎంసిబి స్టేడియం అడ్మినిస్ట్రేటర్ కన్నం మధు పిఆర్ఓ స్పోర్ట్స్ అథారిటీ సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు















