ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 15:
ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారా? అనే సమకాలీన సామాజిక అంశాన్ని తన కవిత్వం ద్వారా ప్రశ్నించిన ఖమ్మం జర్నలిస్టు, కవయిత్రి మధుశ్రీ నలుబోలకు జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. గుంటూరులో ISO 9001 సర్టిఫికేషన్ పొందిన డా. పట్టాభి కళాపీఠం (రిజి. నం. 234/2010) ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ వార్షికోత్సవ జాతీయస్థాయి కవితల పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఆమె ద్వితీయ బహుమతి సాధించారు.నవంబర్ 14న జరిగిన పురస్కార ప్రదానోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు, దూరదర్శన్ ప్రసార రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులు ఓలేటి పార్వతీశం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ఆచార్య పి. బ్రహ్మాజీరావు తదితర ప్రముఖుల సమక్షంలో మధుశ్రీ నలుబోలు ద్వితీయ బహుమతితో పాటు నగదు పురస్కారాన్ని కూడా అందుకున్నారు.















