EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రెడ్ క్రాస్ సేవలు విస్తృత పరచాలి

ఈతరం భారతం హైదరాబాద్: నవంబర్ 15:

నేడు లోక్ భవన్ (రాజ్ భవన్) జరిగిన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జిల్లా రెడ్ క్రాస్ ఎన్నికలలో ఎన్నిక కాబడినటువంటి జిల్లా చైర్మన్లు మరియు రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులతో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు శివ ప్రతాప్ శుక్ల గారి అధ్యక్షతన లోక్ భవన్ లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెడ్ క్రాస్ సేవలు విస్తృతపరచాలని, నశాముక్త భారత అభియాన్ పై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరారు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నటువంటి గవర్నర్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగాఎన్నికకాబడినటువంటి జిల్లా చైర్మన్లు మరియు రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు గవర్నర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు రమేష్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ లు, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top