ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 15:
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి ప్రభుత్వం పింఛన్లను మంజూరు చేసింది. ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ సొమ్మును జమ చేసేందుకు సెర్ప్ (SERP) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకోసం ఆర్థిక శాఖ ఆమోదంతో ప్రభుత్వం అదనపు బడ్జెట్ను కూడా విడుదల చేసింది.
లబ్ధిదారుల వివరాలు:
వితంతువులు: 2,77,894
దివ్యాంగులు: 1,00,224
ఒంటరి మహిళలు: 53,844
గీత కార్మికులు: 27,444
చేనేత కార్మికులు: 4,451















