ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 15:
తెలంగాణ గోల్కొండ గడ్డకు చెందిన అరుదైన పింక్ వజ్రం అంతర్జాతీయ వేలంలో సంచలనం సృష్టించింది. జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ అరుదైన ‘బల్గారి పింక్’ వజ్రం ఏకంగా రూ.130 కోట్లకు అమ్ముడైంది.24 క్యారెట్ల బరువున్న ఈ వజ్రాన్ని 1950లలో కొనుగోలు చేసి, ప్రముఖ బల్గారి సంస్థ ప్రత్యేకంగా ఉంగరంగా రూపొందించింది. దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద ఉన్న ఈ వజ్రాన్ని తొలిసారిగా వేలానికి తీసుకువచ్చారు.
అరుదైన గులాబీ రంగు, అద్భుతమైన నాణ్యత కారణంగా క్రిస్టీస్ సంస్థ దీనిని ‘పింక్ డైమండ్స్‌లో మోనాలిసా’గా అభివర్ణించింది.ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గోల్కొండ వజ్రాల వైభవం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.. !















