ఈతరం భారతం వికారాబాద్ జిల్లా, నవంబరు 15: :
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం నాందార్ పూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుంకిమెట్ల నుంచి కోస్గి వెళ్లే రోడ్డులో కారు ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలవగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతుల్లో ఒకరికి రెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.















