ఈ తరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 15:
కడుపులో ఉండగానే బిడ్డకు సర్జరీ…ఢిల్లీ ఎయిమ్స్ రికార్డ్. 25 వారాల గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముకలో ఉన్న తీవ్రమైన లోపాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సరిచేశారు.ఆరు గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్‌ను తల్లి గర్భంలోనే విజయవంతంగా పూర్తి చేశారు.స్పైనా బైఫిడా సమస్యతో ఇబ్బంది పడే కుటుంబాలకు ఈ ఫీటల్ మెడిసిన్ ప్రయోగం కొత్త ఆశలు రేపుతోంది.















