ఈతరం భారతం రంగా రెడ్డి జిల్లా (మహేశ్వరం) నవంబర్18;
విద్యార్థుల్లో విద్యాపరమైన ప్రతిభను గుర్తించి, వారిని ఉన్నత లక్ష్యాల వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో, శ్రీరామ్ గ్రూప్ సహకారంతో నేడు జెల్లుగూడ ప్రభుత్వ పాఠశాలలోn ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గత సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో విద్యా ప్రతిభను అభినందిస్తూ చెక్కును అందజేశారు.
అనంతరం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడి, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. మహేశ్వరం మండలంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు మొత్తం రూ.2 కోట్ల ప్రైజ్ మనీ అందించే లక్ష్యంతో విద్యార్థుల్లో విద్యాపరమైన పోటీ తత్వాన్ని, సాధించాలనే తపనను పెంపొందించాలని కోల శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రక్షణ సేన మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కోలా శ్రీనివాస్, శ్రీరామ్ గ్రూప్ రీజినల్ మేనేజర్ సోమ శ్రీధర్,యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి. మేనేజర్ శ్రీనివాస్, యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి. జిల్లా అధ్యక్షులు పురం మహేందర్ రెడ్డి, డా. ఏం. స్వప్న, టిఆర్ఎస్ నాయకులు సుచరిత రెడ్డి, వినోద్,, జాలా శివ యాదవ్, నర్సింలు , మరియు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉప ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించడం, వారి కృషికి తగిన ప్రోత్సాహం అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అభివృద్ధికి తోడ్పడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.















