EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దళితుల ఎక్సాల్ పట్టా భూముల స్వాధీనం దారుణం

ఈతరం భారతం హయత్‌నగర్ నవంబర్ 19:

హయత్‌నగర్ పరిధిలోని సర్వే నంబర్ 255లో వందల సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దళితుల ఎక్సాల్ పట్టా భూములను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కేటాయిస్తూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ బాధితులతో కలిసి భూములను సందర్శించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు భూములకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లుగానే పేదలకు గతంలో కేటాయించిన అసైన్డ్, ఎక్సాల్ పట్టా భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని, అది సాధ్యం కాని పక్షంలో కనీసం సగం భూమినైనా బాధితుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

పోలీసు బందోబస్తు మధ్య ప్రీకాస్ట్ గోడల నిర్మాణం చేపట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, పేదలు, దళితుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో వందల కోట్ల విలువైన భూముల విక్రయాలకు తాము అడ్డుపడటం లేదని, కానీ పేదల జీవనాధారమైన భూములను లాక్కుంటే మాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని ఎంపీ ఈటల రాజేందర్ గారు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమం బీజేపీ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్, ఏల్. బి. నగర్ ఇంచార్జ్ సామ రంగా రెడ్డి, ఉమ్మడి మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…

Related News

Select the Topic
Scroll to Top