EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్: అశ్లీల, హింసాత్మక కంటెంట్‌పై మెటా కొత్త రూల్స్

ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 18

భారత ప్రభుత్వం చేసిన సూచనల మేరకు ఇన్‌స్టాగ్రామ్ తన కంటెంట్ రికమెండేషన్ విధానంలో కీలక మార్పులు చేసింది. అశ్లీలత, హింస లేదా రెచ్చగొట్టే స్వభావం ఉన్న పోస్టులను ఇకపై ఫీడ్‌లో తక్కువగా చూపిస్తారు. ప్రధానంగా యూజర్లు ఫాలో అవ్వని అకౌంట్ల నుంచి వచ్చే రీల్స్, ఎక్స్‌ప్లోర్ కంటెంట్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో కంటెంట్‌ను పరిశీలించి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని మెటా వెల్లడించింది. యూజర్ల నుంచి వచ్చే ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని సెఫ్టీ సెట్టింగ్స్‌ను మెటా అప్‌డేట్ చేసింది.

• అశ్లీల, రెచ్చగొట్టే కంటెంట్‌ను తగ్గించేందుకు ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్‌లో మార్పులు.

• యూజర్లు ఫాలో కాని అకౌంట్ల నుంచి వచ్చే అభ్యంతరకర పోస్టులు, రీల్స్ నియంత్రణ.

• అక్టోబర్ 10న కేంద్ర ఐటీ శాఖ జారీ చేసిన సూచనల నేపథ్యంలో మెటా ఈ చర్యలు చేపట్టింది.

Related News

Select the Topic
Scroll to Top