ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 19:
పాలసీదారుడితో తనకు ఉన్న అనుబంధాన్ని సేవా కార్యక్రమం ద్వారా చాటుకున్నారు జీవిత బీమా సలహాదారు కౌటికె విఠల్. కౌటికే విఠల్ పాలసి దారుడైన సీల్వెల్ కార్పొరేషన్ చైర్మన్ బండారు సుబ్బారావు జన్మదినం సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద వెయ్యి మందికి సహపంక్తి భోజన కార్యక్రమంని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఎల్ఐసీ సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జన్మదిన కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రభాత్ కుమార్ సాహు మాట్లాడుతూ, పాలసీదారుడి జన్మదినాన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమంగా నిర్వహించిన కౌటికె విఠల్ను అభినందించారు.
పాలసీదారులతో ఆత్మీయ అనుబంధాన్ని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
కౌటికె విఠల్ మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచిన పాలసీదారులు, వారి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటాను అని అన్నారు.బండారు సుబ్బారావు గారి జన్మదినం సందర్భంగా భోజన కార్యక్రమం నిర్వహించే అవకాశం రావడం నాకు ఎంతో ఆత్మసంతృప్తినిచ్చింది అని కౌటికే విఠల్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, సీఎల్ఐఏ మేనేజర్ ప్రభాకర్, సిటీ బ్రాంచ్ మేనేజర్ రవికిరణ్, అడ్వకేట్ మడుపల్లి రవి గుప్తా, విఠల్ సతీమణి శ్రీమతి కౌటికె కావ్య, కుమారుడు శ్రీ కౌటికె ఆదిత్య,అవోపా హైదరాబాద్ కోశాధికారి మాకం బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.















