EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

26న ఇందిరమ్మ చీరలు పంపిణీ: మంత్రి సీతక్క

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 19;

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.కాగా, చీరల పంపిణీ గురువారం ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం అధికారులు ప్రకటించారు. ముందుగా సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించారు.ఇదిలా ఉండగా, చీరల పంపిణీతో పాటు కొత్తగా మంజూరైన లబ్ధిదారులతో కలిపి మొత్తం 4,63,857 మందికి చేయూత పెన్షన్లను కూడా 26వ తేదీ నుంచి అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Related News

Select the Topic
Scroll to Top