ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 23:
ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులకు ఉపశమనం కల్పించి న్యాయం జరిగేలా చూడాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్ల వద్ద ఉన్న అసలు ఆగ్రిగోల్డ్ బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ మరియు వివరాల నమోదు కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిధిలోని బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్ల సౌకర్యార్థం సుగ్గలవారి తోట లోని ఖమ్మం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న సిటీ ట్రైనింగ్ సెంటర్ (ఓల్డ్ సీ.పి ఆఫీస్) నందు ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.
ఈ కేంద్రం 25.11.2026 నుంచి అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమీషనర్ శ్రీ సునీల్ దత్ మాట్లాడుతూ, ఆగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లు నిర్ణీత తేదీ నుంచి తమకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం కేంద్రానికి హాజరై, అవసరమైన పత్రాలతో బాండ్ల ధృవీకరణ మరియు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ధృవీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూచించిన పత్రాలన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలని, అసలు బాండ్లను కేవలం పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, వాటిని అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బాధితులు ఈ ప్రక్రియపై ఎలాంటి అపోహలకు గురికాకుండా, అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
ధృవీకరణ కేంద్రం వివరాలు
కేంద్రం: ఖమ్మం పట్టణం
పరిధి: ఖమ్మం జిల్లా
కేంద్రం చిరునామా: ఖమ్మం సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న సిటీ ట్రైనింగ్ సెంటర్ (ఓల్డ్ సీ.పి ఆఫీస్)
కేంద్రం ఇన్చార్జ్: ఎం. డి. సర్వర్, ఏ.సీ.పి, ఖమ్మం సీ.సీ.ఎస్.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:
ఎం.డి సర్వర్, ఏ.సీ.పి, సీ. సీ.ఎస్, 8712659185
ఎస్.రాజ్ కుమార్ గౌడ్, ఇన్స్పెక్టర్, సీ. సీ.ఎస్, 8712659186
నాగుల్ మీరా, ఆర్.ఐ, 8712575166, 9848586894
రణధీర్, ఎస్.ఐ, సి. ఐ.డి, 8712593269
*ధృవీకరణకు తీసుకురావాల్సిన పత్రాలు
1. డిపాజిటర్ జీవించి ఉన్నట్లయితే
1. అసలు ఆగ్రిగోల్డ్ బాండ్ / నగదు రసీదు (ధృవీకరణ కోసం తప్పనిసరిగా చూపించాలి).
2. అసలు బాండ్‌కు సంబంధించిన సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ జిరాక్స్.
3. ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు జిరాక్స్.
4. పాన్ కార్డు జిరాక్స్.
5. బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (ఖాతాదారుని పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్ స్పష్టంగా ఉండాలి).
6. తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
7. డిపాజిటర్ మొబైల్ నంబర్.
8. బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
9. ఏజెంట్ పేరు, మొబైల్ నంబర్ (తెలిస్తే).
*డిపాజిటర్ మరణించి, నామినీ జీవించి ఉన్నట్లయితే
1. అసలు బాండ్ (ధృవీకరణ కోసం చూపించాలి).
2. అసలు బాండ్ కలర్ జిరాక్స్ (నామినీ సంతకంతో).
3. డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం జిరాక్స్.
4. నామినీ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్.
5. రేషన్ కార్డు / కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం.
6. నామినీ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.
7. నామినీ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
8. నామినీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
9. ఏజెంట్ వివరాలు (తెలిస్తే).
*డిపాజిటర్ మరియు నామినీ ఇద్దరూ మరణించినట్లయితే
1. అసలు బాండ్ (ధృవీకరణ కోసం చూపించాలి).
2. బాండ్ కలర్ జిరాక్స్ (చట్టబద్ధ వారసుడు / కుటుంబ సభ్యుని సంతకంతో).
3. డిపాజిటర్, నామినీ ఇద్దరి మరణ ధృవీకరణ పత్రాలు (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
4. చట్టబద్ధ వారసుని ఆధార్, పాన్ కార్డులు (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
5. రేషన్ కార్డు / కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
6. చట్టబద్ధ వారసుని బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్.
7. తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
8. బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్.
9. ఏజెంట్ వివరాలు (తెలిస్తే).
*డిపాజిటర్ జీవించి ఉండి, ధృవీకరణ కేంద్రానికి స్వయంగా రాలేని సందర్భంలో
1. డిపాజిటర్ అసలు బాండ్ మరియు సంతకం చేసిన కలర్ జిరాక్స్.
2. డిపాజిటర్ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటో (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
3. హాజరయ్యే కుటుంబ సభ్యుని ఆధార్ / గుర్తింపు కార్డు (అసలు చూపించి జిరాక్స్ సమర్పించాలి).
4. కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రం / ధృవీకరణ పత్రం జిరాక్స్.
5. రేషన్ కార్డు లేదా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం ద్వారా డిపాజిటర్తో సంబంధాన్ని నిర్ధారించాలి.
6. డిపాజిటర్ మొబైల్ నంబర్.
7. డిపాజిటర్ నుంచి జారీ చేసిన అధికార పత్రం (Authorization Letter).
*ఏజెంట్ల ద్వారా బాండ్ల సమర్పణ విధానం
1. ప్రతి అసలు బాండ్‌ను ధృవీకరణ కోసం చూపించి, దాని కలర్ జిరాక్స్ సమర్పించాలి.
2. ప్రతి బాండ్ గుర్తింపు సంఖ్యను విడివిడిగా నమోదు చేయాలి.
3. ఏజెంట్ ఆధార్, పాన్ కార్డుల జిరాక్స్ సమర్పించాలి.
4. ఏజెంట్ బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ సమర్పించాలి.
5. ఏజెంట్ తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నంబర్ ఇవ్వాలి.
6. ఏజెంట్ కోడ్ తప్పనిసరిగా పేర్కొనాలి.
7. సమర్పించిన బాండ్ల సంఖ్యను లెక్కించి రికార్డుల్లో నమోదు చేయడం జరుగుతుంది.
*ముఖ్యమైన సూచనలు
– అసలు ఆగ్రిగోల్డ్ బాండ్‌ను కేవలం ధృవీకరణ కోసం మాత్రమే చూపించాలి. అసలు బాండ్‌ను అధికారులకు అప్పగించాల్సిన అవసరం లేదు.
– బాండ్ కలర్ జిరాక్స్‌పై సంబంధిత డిపాజిటర్ / నామినీ / చట్టబద్ధ వారసుడు సంతకం చేసి సమర్పించాలి.
– కలర్ జిరాక్స్లో బాండ్ నంబర్‌తో సహా అన్ని వివరాలు స్పష్టంగా కనిపించాలి.
– బ్యాంక్ పాస్‌బుక్‌లో ఖాతాదారుని పేరు, ఖాతా నంబర్, IFSC కోడ్ స్పష్టంగా ఉండాలి. సమర్పించే బ్యాంక్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
– ఏజెంట్ వివరాలు తెలియని పక్షంలో దరఖాస్తులో ‘తెలియదు / అందుబాటులో లేదు’ అని పేర్కొనవచ్చు.
– డిపాజిటర్ / కుటుంబ సభ్యుడు / ఏజెంట్‌కు సంబంధించిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా అందించాలి.
– పత్రాలు స్వీకరించిన అనంతరం సంబంధిత వ్యక్తులకు రసీదు అందజేయబడుతుంది.
*ధృవీకరణ కేంద్రం పనివేళలు
ధృవీకరణ ప్రక్రియ ప్రతి పని దినంలో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతిరోజు మొదటి 250 మంది ఖాతాదారుల ధ్రువపత్రాలను మాత్రమే పరిశీలించడం జరుగుతుంది.
మండలాల వారీగా ధృవీకరణ తేదీలు, ఖాతాల వివరాలు
ఖమ్మం జిల్లా పరిధిలోని బాధితుల సౌకర్యార్థం మండలాల వారీగా ధృవీకరణ తేదీలను కేటాయించడం జరిగింది. ఏ తేదీన ఏ మండలానికి చెందిన ఎంతమంది డిపాజిటర్లు హాజరుకావాలో వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
రోజు సంఖ్య తేదీ ఖమ్మం ఖాతాలు కవర్ చేసిన ఖమ్మం మండలాలు (ఖాతాలు)
1 25/11/2026 250 బోనకల్ (250)
2 26/11/2026 250 బోనకల్ (250)
3 27/11/2026 250 బోనకల్ (250)
4 28/11/2026 250 బోనకల్ (250)
5 30/11/2026 250 బోనకల్ (250)
6 01/12/2026 250 బోనకల్ (55); చింతకాని (195)
7 02/12/2026 250 చింతకాని (250)
8 03/12/2026 250 చింతకాని (250)
9 04/12/2026 250 చింతకాని (250)
10 05/12/2026 250 చింతకాని (215); ఏన్కూరు (35)
11 07/12/2026 250 ఏన్కూరు (250)
12 08/12/2026 250 ఏన్కూరు (250)
13 09/12/2026 250 ఏన్కూరు (250)
14 10/12/2026 250 ఏన్కూరు (136); కల్లూరు (114)
15 11/12/2026 250 కల్లూరు (250)
16 14/12/2026 250 కల్లూరు (250)
17 15/12/2026 250 కల్లూరు (250)
18 16/12/2026 250 కల్లూరు (33); కామేపల్లి (217)
19 17/12/2026 250 కామేపల్లి (250)
20 18/12/2026 250 కామేపల్లి (250)
21 19/12/2026 250 కామేపల్లి (250)
22 21/12/2026 250 కామేపల్లి (138); ఖమ్మం రూరల్ (112)
23 22/12/2026 250 ఖమ్మం రూరల్ (250)
24 23/12/2026 250 ఖమ్మం రూరల్ (250)
25 24/12/2026 250 ఖమ్మం రూరల్ (250)
26 28/12/2026 250 ఖమ్మం రూరల్ (86); ఖమ్మం అర్బన్ (164)
27 29/12/2026 250 ఖమ్మం అర్బన్ (250)
28 30/12/2026 250 ఖమ్మం అర్బన్ (250)
29 31/12/2026 250 ఖమ్మం అర్బన్ (250)
30 01/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
31 02/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
32 04/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
33 05/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
34 06/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
35 07/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
36 08/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
37 11/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
38 12/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
39 13/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
40 16/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
41 18/01/2027 250 ఖమ్మం అర్బన్ (250)
42 19/01/2027 250 ఖమ్మం అర్బన్ (205); కొణిజర్ల (45)
43 20/01/2027 250 కొణిజర్ల (250)
44 21/01/2027 250 కొణిజర్ల (250)
45 22/01/2027 250 కొణిజర్ల (250)
46 23/01/2027 250 కొణిజర్ల (250)
47 25/01/2027 250 కొణిజర్ల (250)
48 27/01/2027 250 కొణిజర్ల (250)
49 28/01/2027 250 కొణిజర్ల (250)
50 29/01/2027 250 కొణిజర్ల (250)
51 31/01/2027 250 కొణిజర్ల (153); కూసుమంచి (97)
52 01/02/2027 250 కూసుమంచి (250)
53 02/02/2027 250 కూసుమంచి (250)
54 03/02/2027 250 కూసుమంచి (250)
55 04/02/2027 250 కూసుమంచి (250)
56 05/02/2027 250 కూసుమంచి (250)
57 06/02/2027 250 కూసుమంచి (250)
58 08/02/2027 250 కూసుమంచి (83); మధిర (167)
59 09/02/2027 250 మధిర (250)
60 10/02/2027 250 మధిర (250)
61 11/02/2027 250 మధిర (250)
62 12/02/2027 250 మధిర (250)
63 15/02/2027 250 మధిర (250)
64 16/02/2027 250 మధిర (207); ముదిగొండ (43)
65 17/02/2027 250 ముదిగొండ (250)
66 18/02/2027 250 ముదిగొండ (250)
67 19/02/2027 250 ముదిగొండ (250)
68 20/02/2027 250 ముదిగొండ (250)
69 22/02/2027 250 ముదిగొండ (250)
70 23/02/2027 250 ముదిగొండ (250)
71 24/02/2027 250 ముదిగొండ (250)
72 25/02/2027 250 ముదిగొండ (250)
73 26/02/2027 250 ముదిగొండ (250)
74 27/02/2027 250 ముదిగొండ (243); నేలకొండపల్లి (7)
75 01/03/2027 250 నేలకొండపల్లి (250)
76 02/03/2027 250 నేలకొండపల్లి (250)
77 03/03/2027 250 నేలకొండపల్లి (250)
78 04/03/2027 250 నేలకొండపల్లి (250)
79 05/03/2027 250 నేలకొండపల్లి (250)
80 08/03/2027 250 నేలకొండపల్లి (250)
81 09/03/2027 250 నేలకొండపల్లి (250)
82 11/03/2027 250 నేలకొండపల్లి (250)
83 12/03/2027 250 నేలకొండపల్లి (250)
84 15/03/2027 250 నేలకొండపల్లి (250)
85 16/03/2027 250 నేలకొండపల్లి (250)
86 17/03/2027 250 నేలకొండపల్లి (250)
87 18/03/2027 250 నేలకొండపల్లి (42); పెనుబల్లి (208)
88 19/03/2027 250 పెనుబల్లి (250)
89 20/03/2027 250 పెనుబల్లి (50); రఘునాథపాలెం (200)
90 24/03/2027 250 రఘునాథపాలెం (163); సత్తుపల్లి (87)
91 25/03/2027 250 సత్తుపల్లి (250)
92 27/03/2027 250 సత్తుపల్లి (250)
93 29/03/2027 250 సత్తుపల్లి (250)
94 30/03/2027 250 సత్తుపల్లి (250)
95 31/03/2027 250 సత్తుపల్లి (250)
96 01/04/2027 250 సత్తుపల్లి (250)
97 02/04/2027 250 సత్తుపల్లి (250)
98 03/04/2027 250 సత్తుపల్లి (250)
99 06/04/2027 250 సత్తుపల్లి (4); సింగరేణి (246)
100 07/04/2027 250 సింగరేణి (250)
101 09/04/2027 250 సింగరేణి (250)
102 12/04/2027 250 సింగరేణి (115); తల్లాడ (135)
103 13/04/2027 250 తల్లాడ (250)
104 16/04/2027 250 తల్లాడ (250)
105 17/04/2027 250 తల్లాడ (250)
106 19/04/2027 250 తల్లాడ (250)
107 20/04/2027 250 తల్లాడ (250)
108 21/04/2027 250 తల్లాడ (250)
109 22/04/2027 250 తల్లాడ (209); తిరుమలాయపాలెం (41)
110 23/04/2027 250 తిరుమలాయపాలెం (250)
111 24/04/2027 250 తిరుమలాయపాలెం (250)
112 26/04/2027 250 తిరుమలాయపాలెం (250)
113 27/04/2027 250 తిరుమలాయపాలెం (250)
114 28/04/2027 250 తిరుమలాయపాలెం (186); వేంసూరు (64)
115 29/04/2027 250 వేంసూరు (250)
116 30/04/2027 250 వేంసూరు (250)
117 03/05/2027 250 వేంసూరు (250)
118 04/05/2027 250 వేంసూరు (209); వైరా (41)
119 05/05/2027 250 వైరా (250)
120 06/05/2027 250 వైరా (250)
121 07/05/2027 250 వైరా (250)
122 10/05/2027 250 వైరా (240); ఎర్రుపాలెం (10)
123 11/05/2027 250 ఎర్రుపాలెం (250)
124 12/05/2027 250 ఎర్రుపాలెం (250)
125 13/05/2027 250 ఎర్రుపాలెం (250)
126 14/05/2027 250 ఎర్రుపాలెం (250)
127 15/05/2027 115 ఎర్రుపాలెం (115)
కావున ఖమ్మం జిల్లా పరిధిలోని ఆగ్రిగోల్డ్ డిపాజిటర్లు, బాధితులు మరియు ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీని గమనించి, అవసరమైన అన్ని అసలు పత్రాలు మరియు జిరాక్స్ కాపీలతో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ధృవీకరణ కేంద్రానికి హాజరై నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, ఖమ్మం పోలీస్ కమీషనర్ సూచించారు.















