EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అయోమయంలో గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లు!

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 13:

బంగారం రేటు తగ్గడం తో…. బ్యాంకర్లు కి తలనొప్పి గా మారిన వైనం…. గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు ..నోటీసులు…మరింత బంగారం పెట్టాలి లేక..డబ్బులు కట్టాలి ..అయోమయంలో గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లు!

భారీగా పతనమైన పసిడి ధరలతో గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు.అదనపు నగదు లేదా మరింత బంగారం పెట్టాలంటూ బ్యాంకుల మార్జిన్ కాల్స్.ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎల్టీవీ నిష్పత్తిని కొనసాగించేందుకు బ్యాంకుల చర్యలు.బకాయిలు వసూలు కాకపోతే నిబంధనల మేరకు వేలం వేసేందుకు సిద్ధమవుతున్న సంస్థలు.

గడచిన కొన్ని నెలల్లో బంగారం ధరలు గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా తగ్గాయి. గతంలో పసిడి ధరలు భారీగా ఉన్న సమయంలో రుణాలు తీసుకున్న వారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. ధరలు తగ్గడంతో తనఖా ఆస్తుల విలువ, తీసుకున్న రుణ మొత్తానికి మధ్య ఉండే నిష్పత్తి (LTV) ఆర్బీఐ నిర్దేశించిన పరిమితిని దాటిపోతోంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ₹2.5 లక్షల వరకు రుణాలకు 85 శాతం, ₹2.5 లక్షల నుంచి ₹5 లక్షల వరకు 80 శాతం, ₹5 లక్షల కంటే ఎక్కువ రుణాలకు 75 శాతం మేర ఎల్టీవీని రుణ కాలపరిమితి ముగిసేవరకు కొనసాగించాల్సి ఉంటుంది.

Related News

Select the Topic
Scroll to Top