ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 23;
పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబర్ నగర్ వార్డు కోశాధికారి నందిమల్ల వరలక్ష్మి పిలుపునిచ్చారు పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం పురస్కరించుకొని సికింద్రాబాద్ లోని బౌద్దనగసర్ డివిజన్ అంబర్ నగర్ లోని బాల్ వదడి స్కూల్ .సరస్వతి స్కూల్ లలో వరలక్ష్మి పోలియో చుక్కలు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.అనంతరం వరలక్ష్మి మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇదివరకు పోలియో వ్యాధితో చిన్నారుల జీవితాలు దుర్భరంగా మారేవని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.పిల్లల భవిష్యత్తు,ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో, అంబర్నగర్ కాలని వయిస్ ప్రెసిడెంట్ సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శి సాయి శరన్ తదితరులు పాల్గొన్నారు.















