EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సమాచార హక్కుకు చట్టం వివరణపై అధికారుల నిర్లక్ష్యం: సిటీజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 26

మణికొండ జాగీరు సర్వే నెంబర్ 42 లోని 1450 గజాల విలువైన ప్రభుత్వ స్థలం విషయమై సంబందిత నార్సింగి సర్కిల్ మున్సిపల్ అధికారులను, గండి పేట మండలం తాసిల్దార్ను, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ను సమాచార హక్కు చట్టం క్రింద వివరాలు ఇవ్వడం లేదని సిటీజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు ఆరోపించారు.

11 ఆగస్టు 2026 రోజున దస్తావేజు నెంబర్ 4009/2024, రిట్ నెంబర్ 25279/2026 సంపూర్ణ వివరాలు కోరగా ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు గమ్మున ఉండడం వారి ప్రత్యేకతగా ఉన్నధని స్థానికులు విడ్డూర పోతున్నారు.

తీవ్ర నిరసన తదనంతరం ఏడ్చే వాడి కళ్లు తుడిచినట్లు ఈ మద్య కాలంలో సర్వే చేయడం, అట్టి వివరాలు ప్రజా సౌకర్యర్థం బహిర్గతం చేయకుండా, చట్టం ప్రకారం సమాచార హక్కుకు వివరణ ఇవ్వాక పోగా ఉలుకూ పలుకు లేకుండా గమ్మున ఉండడంలో అధికారుల మతలబు ఏమిటో తెలియ రాకున్నదని ప్రజలు నిలదీస్తూన్నారు. అందువలన పై అధికారులైన శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కమిషనర్కు, రంగారెడ్డి జిల్లా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కు, రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్కు పైన తెలిపిన 11 ఆగస్టు 2026 రోజున కోరిన సమాచార హక్కు చట్టం వివరణపై అప్పీలు వేయడం జరిగిందని ది సిటీజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తెలిపారు. ఇట్టి వ్రాత ప్రతులలో కోరిన దస్తావేజు నెంబర్ 4009/2024 వివరాలు, రిట్ నెంబర్ 25279/2026 సంపూర్ణ వివరాలతో జవాబు వస్తుందని ఆశాభావం వ్యక్త పరుస్తు, లేదంటే సంబందిత న్యాయస్థానంకు వెళ్లడానికి కూడా వెనుకాడ బొమని హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top