EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జె ఎన్ జె హెచ్ ఎస్ కు పేట్ స్థలాలు ఇవ్వాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

ఈతరం భారతం హైదరాబాద్ 26:

జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల సొసైటీ (JNJHS) సభ్యులకు ఇళ్ల స్థలాల కోసం డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2008 లో కేటాయించిన నిజాంపేట్, పేట్ బషీరాబాద్ భూములనే స్వాధీనం చెయ్యాలని టీం జె ఎన్ జె డిమాండ్ చేసింది.

“భారత రాజ్యాంగం దినోత్సవం” సందర్భంగా గురువారం ట్యాంక్ బండ్ పై ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి టీం జె ఎన్ జె ఐ మేరకు వినతి పత్రం ఇచ్చింది. ఈ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి కూడా అందచేశారు.

సమాజంలోని పేదలకు న్యాయం చేయాలనేదే అంబేద్కర్ ఆశయమని, ఇందుకు అనుగుణంగా JNJHS సభ్యులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి JNJHS 2011 సంవత్సరం లో 12 కోట్ల 33 లక్షల రూపాయలు చెల్లించిందని ఈ సొసైటీ డైరెక్టర్లు పి వి రమణా రావు, కె. అశోక్ రెడ్డి గుర్తు చేశారు. అంటే ప్రభుత్వం వద్ద 70 ఎకరాలను తమ సొసైటీ కొనుగోలు చేసిందన్నారు.

రాష్ట్ర హై కోర్టు తీర్పు పై సుప్రీం కోర్టుకు ప్రభుత్వమే వెళ్లిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ధరల వ్యత్యాసాన్ని సరి చేసి రెండు చోట్ల భూములను JNJHS కు స్వాధీనం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం JNJHS కు భూమిని స్వాధీనం చెయ్యాల్సి ఉందని న్యాయ నిపుణులు కూడా పేర్కొన్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన సూచనల మేరకు న్యాయ నిపుణులు కూడా నిజాంపేట్, పేట్ బషీరాబాద్ భూములను మాత్రమే JNJHS కు ఇవ్వాలని సూచించారని తెలిపారు.

2024 సెప్టెంబర్ 08 న ప్రభుత్వం జారీ చేసిన మెమోకు అనుగుణంగా పేట్ భూములను వెంటనే తమ సొసైటీకి స్వాధీనం చెయ్యాలని కోరారు. ఇప్పటికే JNJHS కు చెందిన 90 మంది సభ్యులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందన్నారు. పేట భూముల కోసం సొసైటీ సభ్యులంతా 20 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నారు.

ఈ కార్యక్రమం లో JNJHS సభ్యులు మర్రి రాము, బుర్రా విజయ శేఖర్, వి. శ్రీనివాస్ రెడ్డి, దామరాజు వెంకటేశ్వర్లు, బి, శ్రీనివాస్ రెడ్డి, బి. చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top