EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాజ్యాంగంమాత్రమే దేశ ప్రజలకు రక్షణ

ఈతరం భారతం హైద్రాబాద్ నవంబర్ 26:

దేశప్రజలందరికి బాబాసాహెబ్ 2సంవత్సరాల 11నెలలు 18రోజులు ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపి అభివృద్ధి చెందిన దేశాల నుండి ఈ దేశ ప్రజలకు సరిగ్గా సరిపోయే విధంగా కొన్ని సూచనలు తీసుకొని ప్రపంచంలో నే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం రాశారు. అందుకే భారత రాజ్యాంగం మాత్రమే ఈ దేశ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నదని డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ పేర్కొన్నారు. ఈ రోజు కూకట్పల్లి నియోజకవర్గం ఖైతలాపూర్ రఘూవేంద్ర కాలనీ లోని డాక్టర్ బి అర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తదనంతరం శ్రీకృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగన్ని ప్రజలు కాపాడుకోవాలని, కొన్ని పార్టీలు రాజ్యాంగం మారుస్తామని కుట్రలు చేస్తున్నారని వాటిని ఓట్ల రూపంలో అడ్డుకోవాలని డాక్టర్ శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు భూక్యా వీరన్న, మాల మహానాడు నాయకులు డేవిడ్, బద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top