ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 26;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో గత 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న తెలంగాణ ESI వైద్య వ్యవస్థను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ESIC నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం –ఇ ఎస్ ఐ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ESI వైద్య వ్యవస్థను పరిరక్షించాలని, ESIC తీసుకువస్తున్న సొసైటీ ప్రతిపాదనలను వెంటనే నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి సంఘం తరఫున వినతిపత్రం సమర్పించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ టిలిపారు.గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచిసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగుతున్న ESI హాస్పిటళ్లు, డిస్పెన్సరీల ద్వారా కోటి మందికి పైగా కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు.
అయితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ESIC సొసైటీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి తీసుకువస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రామచంద్రాపురం, నాచారం ESI హాస్పిటళ్లను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు ఈటల రాజేందర్ గార్ల ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారని సంఘం పేర్కొంది.
గత ఏడు సంవత్సరాలుగా ESI డైరెక్టర్గా వైద్యుడిని నియమించకపోవడం వల్ల పరిపాలనాపరంగా, వైద్య సేవల పరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. కోటి మందికి పైగా లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటే సమర్థవంతమైన వైద్య నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
*ముఖ్యమంత్రికి సంఘం చేసిన ప్రధాన విజ్ఞప్తులు*
ESIC ప్రతిపాదిస్తున్న సొసైటీ విధానాన్ని వెంటనే నిలిపివేయాలి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రామచంద్రాపురం, నాచారం ESI హాస్పిటళ్లను యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలి.తెలంగాణ ESI డైరెక్టర్గా వెంటనే సీనియర్ వైద్యుడిని నియమించాలి. ESI ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి లేదా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, కోటి మందికి పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కార్యాచరణ రూపొందించాలి.
తెలంగాణ రాష్ట్ర కార్మికుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ESI వైద్య వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం కానివ్వకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే అన్ని ESI హాస్పిటళ్లు కొనసాగిస్తూ, వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశం లో తెలంగాణ ప్రభుత్వఇ ఎస్ ఐ. వైద్యుల సంఘం
డా. CH. కళ్యాణ్ – ఉపాధ్యక్షులు- డా. U. ఆదిత్య – ప్రధాన కార్యదర్శి కమిటీ సభ్యులు:- డా. రవి,డా. సుజా- డా. శ్రవణ్ రెడ్డి,డా. రాచన్న- డా. షరాన్ థామస్ తదితరులు పాల్గొన్నారు.















