EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బంగారం బిస్కెట్లు.. కట్టల కొద్దీ నగదు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ వెలికితీత

ఈతరం భారతం/ బస్తర్/భారత్/నవంబర్/27

ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ మావోయిస్టు డంప్‌ను వెలికితీశాయి. ఇంద్రావతి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన పెట్టె నుంచి సుమారు రూ.4.29 కోట్ల విలువైన 3.84 కిలోల బంగారంతో పాటు రూ.24.22 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నాయి.

భారీ నిఘా ఆపరేషన్‌తో డంప్ గుర్తింపు..

నవంబర్ 27న భైరమ్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీగా నగదు, బంగారాన్ని భూమిలో దాచినట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో బీజాపూర్ ఎస్పీ ఉమేశ్ ప్రసాద్ గుప్తా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) రవీంద్ర కుమార్ మీనా నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

స్టీల్ పెట్టెలో 33 బంగారు బిస్కెట్లు..

ఈ క్రమంలో భూమిలో పాతిపెట్టిన స్టీల్ పెట్టె బయటపడింది. దానిని తెరిచి చూడగా 10 తులాల బరువున్న 33 బంగారు బిస్కెట్లు లభించాయి. వీటి మొత్తం బరువు 330 తులాలు.

Related News

Select the Topic
Scroll to Top