ఈతరం భారతం ములుగు నవంబర్ 28
ములుగు జిల్లాలో రూ.145 కోట్లతో పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు త్వరలో మొదలవుతాయని మంత్రి సీతక్క తెలిపారు.లక్నవరం సరస్సులో నీళ్లు తగ్గుతుండటంతో, రూ.35 కోట్లతో రామప్ప-లక్నవరం అనుసంధాన కాలువ కట్టనున్నట్లు, కొత్త ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.జిల్లా కలెక్టర్‌తో కలిసి మెగా రైతు మేళాను ప్రారంభించిన మంత్రి, కరువును తట్టుకునేలా శాస్త్రీయ సాగు, పంటల మార్పిడి, డ్రోన్లు, ఆధునిక యంత్రాల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.రామచంద్రపురం, లక్నవరం ప్రజల కోసం కొత్త ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులను కూడా ప్రారంభించారు.















