EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అండాల అక్రమ సేకరణ వ్యవహారం…ఓయాసిస్ ఫెర్టిలిటీ సంస్థకు చెందిన ఇద్దరు అరెస్ట్

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 28మల్కాజిగిరి పోలీసులు అండాల అక్రమ సేకరణ, అనుమతుల్లేని సంతానోత్పత్తి వైద్య విధానాల వ్యవహారంలో కీలక పురోగతి సాధించారు. సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ (ఓయాసిస్ ఫెర్టిలిటీ) సంస్థకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ప్రతీక్ అనిల్ గగ్లానీ, డాక్టర్ రాజర్షి దేబ్‌ను అరెస్ట్ చేశారు.ఎల్బీనగర్ విభాగం ఏసీపీ బి. రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్న విచారణలో అండాల దాతల నియామకం, అనుమతుల్లేని వైద్య విధానాలు, భారీ ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.నిందితుల నుంచి మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఈ వ్యవహారంలో మరెవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మల్కాజ్గిరి పో లీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ , ఏసీపీ బి. రవీంద్ర రెడ్డి పర్యవేక్షణలో మహిళల రక్షణ, వ్యవస్థీకృత నేరాల నిర్మూలన, బాధ్యులందరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంపై పోలీసులు దృష్టి పెట్టారు.

Related News

Select the Topic
Scroll to Top