EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అందరి సహకారంతో తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తా

ఈతరం భారతం తిరుపతి ఆగస్టు 15 శనివారం (రిపోర్టర్ మనోజ్ కుమార్ )

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరాన్ని అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా శనివారం జయకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయం కు కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతోనే తిరుపతి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టానని, ఎంతో అదృష్టమని తెలిపారు. మునిసిపల్ విభాగంలో పనిచేయడం అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని అందరి సహకారంతో ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక టార్గెట్ పెట్టుకుని సమయపాలన పాటిస్తూ నగర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top