ఈతరం భారతం తిరుపతి ఆగష్టు 27 గురువారం రిపోర్టర్ మనోజ్ కుమార్
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీఎస్పీ ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని గరుడ వారధి ఫ్లైఓవర్‌పై ప్రత్యేక హెల్మెట్ తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐలు భాస్కర్ నాయక్, సుబ్బరామిరెడ్డి, శ్రీనివాసులు, ఎస్ఐలు పురుషోత్తంరెడ్డి, వెంకటేష్, నాగరాజు, వెంకటేశన్ పాల్గొని వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ వినియోగించాలని పోలీసులు సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.అదేవిధంగా మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి వాహన తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.















