ఈతరం భారతం తిరుపతి, జూలై 07 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
రైల్వే ప్రాజెక్ట్,భూసేకరణ, జాతీయ రహదారులు పనులు శ్రీ సిటీ ఫేస్ -2, ఎల్ జి ఫేస్-2, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, రాళ్లకుప్పం, స్పేస్ సిటీ ఫేస్ 1, 2,3,4, నాయుడుపేట ఫేస్ 2, వానెల్లూరు, పాగలి, జాతీయ రహదారులు, వైజాగ్ చెన్నై కారిడార్పైపు లైన్ పనులు,ఏ డీబి రోడ్డులు, దుగ్గరాజపట్నం పనులు, కృష్ణపట్నం పోర్ట్, రైల్వే ప్రాజెక్ట్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి శ్రీ సిటీలోని ఎల్జి, రాయల్ ఎంఫిల్డ్ కంపెనీకి సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులపై సమీక్షా పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు తో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని సమావేశ మందిరంలో రైల్వే ప్రాజెక్ట్ పనులు,జాతీయ రహదారులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీ ఫేస్ -2, ఎల్ జి ఫేస్-2,స్పేస్ సిటీ ఫేస్ 1, 2,3,4, నాయుడుపేట ఫేస్ 2, వానెల్లూరు, పాగలి, అంశాలు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, ఏ డీబి రోడ్డులపై నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు, చెన్నై నేషనల్ హైవే పి డి లు, రవీంద్ర రావు, రైల్వే ప్రాజెక్టు అధికారి, సదరన్ రైల్వే అధికారి వామన మూర్తి, నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎల్. శివకుమార్, టి టి డి వెల్ఫేర్ అధికారి, ఎస్ఈ ఇరిగేషన్, ఆర్అండ్ బి ఎస్ఈ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారి, సంబంధిత మండలాల తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు,తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… శ్రీ సిటీ ఫేజ్ -2, ఏ పి ఐ ఐ సి లోని ఎల్ జి ఫేజ్ -1,2, 3 కొల్లాడం, ఇరుగుళం,పెద్దేటిపాకం,రాళ్లకుప్పం, శ్రీ సిటీ ఫేజ్ -1, 2,3,4, నాయుడుపేట ఫేస్ 2, వానెల్లూరు, పాగలి, రాయల్ ఎంఫిల్డ్ ప్రాజెక్టు లకు సంబందించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు లకు సంబందించిన పెండింగ్ కోర్టు కేసులను కూడా త్వరగా పరిస్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్ పై వున్న సమస్యలను సత్వరమే పరిస్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, విసిఐసి రోడ్డు, ఏపిఐఐసి ప్రాజెక్ట్స్,వైజాగ్ చెన్నై కారిడార్ పైపు లైను పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న పనులపై నడికుడి – శ్రీకాళహస్తి, ఏర్పేడు – పూడి, గుమ్మడి పూండి-గూడూరు, గూడూరు-రేణిగుంట, పాకాల – తిరుపతి, తిరుపతి – కాట్పడి అర్కొణం – రేణిగుంట, సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను, దుగ్గరాజపట్నం, వేగవంతం చేయాలన్నారు. ఆరు లైన్లు రహదారులు నిర్మాణం, నాయుడుపేట-రేణిగుంట, రేణిగుంట- కడప రేణిగుంట నుండి చెన్నై రహదారుల పనులు పూర్తి చేయాలని భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకొని నాణ్యత తో పనులు పూర్తి కావాలని అన్నారు. ఎయిర్పోర్ట్, ఇస్సేర్, కరకంబాడి, ఎమ్ ఐ జి లే అవుట్ తిమ్మాజికండ్రిగ, పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. అలాగే ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఫారెస్ట్, జల వనరుల శాఖ అధికారులు అందరూ కలసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. ఏపీఐఐసీ ప్యాకేజీ 5, ఎడిబి రోడ్లు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.వడమాలపేట, ఏర్పేడు మండలాలలో పాదిరేడు అరణ్యం, పల్లం గ్రామాల నందు టీటీడీ ఉద్యోగస్తులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కూడా త్వరిత గతిన చర్యలు తీసుకొని పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో తిరుపతి, శ్రీకాళహస్తి,సూళ్లూరుపేట ఆర్డీఓలు, రామ్మోహన్, బానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్ మాండ్, ఏపీఐఐసీ తిరుపతి జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారి రాంప్రసాద్, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్,సంబంధిత తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు , సెక్షన్ ఆధికారులు భాస్కర్, చైతన్య, భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.















