EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఏబీవీపీ బషీర్బాగ్ నగర శాఖ ఆధ్వర్యంలో “క్లీన్ క్యాంపస్ – గ్రీన్ క్యాంపస్”

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 7;

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆలియా జూనియర్(బాలుర) కళాశాల ఆధ్వర్యంలో జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా “క్లీన్ క్యాంపస్ – గ్రీన్ క్యాంపస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

,ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏబీవీపీ నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా నగర కార్యదర్శి సురేందర్ మాట్లాడుతూ, ఏబీవీపీ కేవలం విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు చేసే సంస్థ మాత్రమే కాదని, సమాజ నిర్మాణంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్న జాతీయ విద్యార్థి సంస్థ అని అన్నారు. ఏబీవీపీ పరివర్తనాత్మక ఆలోచనలతో విద్యార్థి క్షేత్రంలో సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సామాజిక బాధ్యతా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మమత, సింధూరి, రఘునందన్, రాంప్రసాద్, అక్షిత, మరియు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top