ఈతరం భారతం వికారాబాద్ జులై 7 :
దేశంలోనే వృద్ధులలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనకబడిన పరిస్థితుల్లో జీవిస్తున్నారని, అంతేకాకుండా వృద్ధులు సామాజికంగా, మానసికంగా, ఒంటరితనానికి గురవుతున్నారని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. నేడు డే కేర్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో సాయి చౌదరి మాట్లాడుతూ భార్య లేదా భర్త చనిపోవడం, ఒంటరిగా జీవించటం, కొడుకులు, కోడళ్ళు లేదా కుమార్తెతో సంబంధాలు లేకపోవడం, వృద్ధాప్యంలో వేధింపులు గురికావడం వల్ల మానసిక కుoగుబాటు, ఆందోళన పెరుగుతున్నాయని, ఒంటరితనంతో బాధపడే వృద్ధులలో గుండె జబ్బులు, తీవ్రమైన డిప్రెషన్, జ్ఞాపక శక్తి తగ్గటం, ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సాయి చౌదరి హెచ్చరించారు. వృద్ధులకు సామాజికంగా మద్దతు ఎంతో అవసరం అని డే కేర్ సెంటర్లలో వినోద కార్యక్రమాలను స్థానికంగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని సామాజికంగా చురుగ్గా ఉండేలా చూస్తుందని, ఆరోగ్య సంరక్షణ, వృద్ధుల శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుందని, ఒంటరిగా నివసించే వృద్ధులకు సామాజికంగా మద్దతు ఎంతో అవసరమని ఈ విషయంలో డే కేర్ సెంటర్ కి రావటం ద్వారా ఒకరికొకరు మానవీయంగా స్పందిస్తారని, వారితో ఆప్యాయంగా మెలుగుతారని తద్వారా సామాజిక మద్దతు ఉంటుందని సాయి చౌదరి పేర్కొన్నారు.















