EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విదేశీయుల వసతి వివరాల ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి: పల్నాడు ఎస్పీ జగదీష్ ఆదహళ్లి

ఈతరం భారతం పల్నాడు ఆంధ్ర ప్రదేశ్ అక్టోబర్ 6 :

_______________________________________

పల్నాడు జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే అన్ని సంస్థల నిర్వాహకులు వారి వివరాలను విధిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి స్పష్టం చేశారు.ఈ మేరకు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి మంగళవారం ఒక అధికారిక ప్రకటన వెలువడింది.జిల్లాలోని హోటళ్లు,గెస్ట్‌హౌస్‌‌లు, హాస్టళ్లు,ఆశ్రమాలు, సత్రాలు,హోమ్‌స్టేలతో పాటు విద్యాసంస్థలు, ఆసుపత్రులు మరియు ఇతర వసతి కేంద్రాల నిర్వాహకులు తమ వద్దకు వచ్చే విదేశీ పౌరుల రాక,బస, బయలుదేరే వివరాలను నిర్దేశిత విధానంలో కచ్చితంగా పొందుపరచాలని ఎస్పీ సూచించారు.ఈ నిబంధన కేవలం విదేశీయులకే కాకుండా, ఓసీఐ (OCI) కార్డు హోల్డర్లు, నేపాల్, భూటాన్ దేశాల పౌరులకు కూడా వర్తిస్తుందని తెలిపారు.

24 గంటల్లోగా డిజిటల్ నమోదు..

ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 మరియు రూల్స్-2025 ప్రకారం.. విదేశీయులు వసతి ప్రదేశానికి చేరుకున్న 24 గంటలలోపు ‘ఫామ్-3’ (Form III) ద్వారా ఆన్‌లైన్ పోర్టల్‌లో (https://indianfrro.gov.in/formIII) వివరాలను నమోదు చేయాలి. అదేవిధంగా వారు వసతి ప్రదేశం నుంచి వెళ్ళిపోయేసమయానికి సంబంధించినవివరాలను కూడా గడువులోగా అప్‌డేట్ చేయాలని పేర్కొన్నారు.ఈ రికార్డులను ఎలక్ట్రానిక్ రూపంలో కనీసం ఒక సంవత్సరం పాటు భద్రపరచాలని, పోలీస్ అధికారులు తనిఖీకి కోరినప్పుడు వాటిని అందుబాటులో ఉంచాలనిఆదేశించారు.

నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు, క్రిమినల్ కేసులు..

చట్ట నిబంధనలను పాటించడంలో విఫలమైతే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. వ్యక్తిగత లేదా వాణిజ్య వసతి కల్పనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే ఒక్కో ఉల్లంఘనకు కనీసం రూ.50,000/- జరిమానా విధిస్తామని తెలిపారు.అలాగే విద్యా మరియు వైద్య సంస్థలు ఉల్లంఘిస్తే కనీసం రూ.1,00,000/- జరిమానాతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.కాబట్టి పల్నాడు జిల్లాలోని అన్ని వసతి కేంద్రాల నిర్వాహకులు చట్టాన్ని తూచా తప్పకుండా పాటించి, పోలీసు యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Related News

Select the Topic
Scroll to Top