ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ జూన్ 8
భారత మామిడి పండ్లకు అమెరికా మార్కెట్లో రోజురోజుకూ భారీ డిమాండ్ పెరుగుతోంది.విభిన్న రుచులు, ప్రత్యేక సువాసనలతో భారత మామిడి పండ్లు అక్కడి వినియోగదారులను ఆకట్టుకుంటుండటంతో దిగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత మామిడి పండ్లకు అమెరికాలో ఉన్న ఆదరణను మరింత విస్తరించేందుకు, ఎగుమతుల అవకాశాలపై అవగాహన కల్పించేందుకు సియాటెల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగినపల్లికి అధిక డిమాండ్ ఏర్పడింది.’మ్యాంగో మ్యాజిక్: ప్రమోషన్ అండ్ టేస్టింగ్ ఈవెంట్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 100 మందికిపైగా భారత మామిడి పండ్ల దిగుమతిదారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మామిడి రకాలను అతిథులకు పరిచయం చేశారు.మహారాష్ట్రకు చెందిన ఆల్ఫాన్సో, కేసర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగినపల్లి, హిమాయత్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లాంగ్డా, దశహరీ, గుజరాత్‌కు చెందిన రైప్ రాజాపురి రకాల మామిడి పండ్లను రుచి చూపించారు.
1,000కు పైగా రకాలకు మామిడి పండ్లు అందుబాటులోకి వచ్చాయి.కార్యక్రమంలో పాల్గొన్న కోస్ట్కో వైస్ ప్రెసిడెంట్ బాబ్ హస్కీ భారత మామిడి పండ్లకు అమెరికా వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణ గురించి ప్రస్తావించారు.ముఖ్యంగా కేసర్ మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉందని, స్టోర్లలో విక్రయానికి ఉంచిన రెండు గంటల్లోనే అవి పూర్తిగా అమ్ముడైపోతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశం నుంచి ఏటా సుమారు 2.6 కోట్ల టన్నుల మామిడి ఉత్పత్తి జరుగుతుండగా, 1,000కు పైగా రకాల మామిడి పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
2007 నుంచి అమెరికాకు భారత మామిడి పండ్ల ఎగుమతులు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి.2023-24 ఆర్థిక సంవత్సరంలో అమెరికా మార్కెట్లో భారత మామిడి ఎగుమతుల విలువ రూ.94.95 కోట్లకు చేరుకోగా, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 130 శాతం అధికంగా నమోదైంది.















