EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇస్రో సాధించిన మరో ఘన విజయం

ఈతరం భారతం ఢిల్లీ, సెప్టెంబర్ 4: శుక్రవారం

____________________________________

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిర్వహించిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 (GSLV-F17) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్, భారతదేశపు తొలి జియోసింక్రోనస్ ఇమేజింగ్ శాటిలైట్ అయిన EOS-05 (Earth Observation Satellite-05)ను నిర్దేశిత కక్ష్యలోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టిందిఈ చరిత్రాత్మక విజయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ  అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ‘భారతదేశానికి గర్వకారణం’ అని అభివర్ణించారు. ‘ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 తో EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం భారత్‌కు ఎంతో గర్వకారణమైన క్షణం. ఇది మన దేశ అంతరిక్ష సాంకేతిక సామర్థ్యాలను, అలాగే ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తోంది’ అని రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం ‘X’ లో పేర్కొన్నారు

Related News

Select the Topic
Scroll to Top