EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రభుత్వం విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 9:

______________________________

కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టనున్న నిరసనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టనున్న నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం విధించిన ఆంక్షలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘పరిస్థితిని బట్టి నిబంధనలు ఉండాలి. కానీ ప్రజల రాకపోకలపై పూర్తి నిషేధం విధించలేమని అత్యున్నత న్యాయ స్థానం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మెట్రో, ఇతర రైలు సర్వీసులను పూర్తిగా నిలిపివేయడం సరికాదని తేల్చిచెప్పింది.ఓటరు జాబితాల సవరణ (సర్‌) ప్రక్రియలో లోపించిన పారదర్శకత, అందుకు బాధ్యులైన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని సీజేపీ శనివారం ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, కాబట్టి రవాణా వ్యవస్థను మొత్తంగా మూసివేయడం తగదని కోర్టు అభిప్రాయపడింది.ఈ ఆంక్షలను తక్షణమే పునః పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరూ ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికులకు రవాణా వంటి ప్రాథమిక సౌకర్యాలు పొందే హక్కు ఉంది అని కోర్టు పేర్కొంది. భద్రతా ఆంక్షలకు, రవాణా వ్యవస్థను పూర్తిగా మూసివేయడానికి చాలా తేడా ఉందని గుర్తుచేస్తూ, మూసివేసిన మెట్రో స్టేషన్ల సంఖ్యను తగ్గించాలని సూచించింది. ‘ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగించలేరు’ అంటూ ప్రభుత్వం అనుసరించిన అతి కఠిన విధానాన్ని కోర్టు తప్పుపట్టింది.

Related News

Select the Topic
Scroll to Top