ఈతరం భారతం న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 23:
సబ్బులు, షాంపూలు, టూత్పేస్టులు, ఇతర సౌందర్య సాధనాలు వంటి ఉత్పత్తుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. ఇకపై ఈ ఉత్పత్తుల ప్యాకేజింగ్పై అబి శాకాహార మూలానికి చెందినవా లేదా దూంసాహార మూలానికి చెందినవా అనే విషయాన్ని తెలియజేసే గుర్తులు తప్పనిసరిగా ఉండాలి. కేంద్రం లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011కు సవరణలు చేసి ఈ మార్పును ప్రవేశపెట్టిందిఈ నిబంధనలు సోమవారం నుంచే అదుల్లోకి వచ్చాయి. ఇకపై, సబ్బులు, షాంపూలు లేదా టూత్పేస్ట్ కొనుగోలు చేసేటప్పుడు ప్యాకేజింగ్పై ఉన్న ఆకుపచ్చ, ఎరుపు లేదా గోధుడు రంగు గుర్తుల ఆధారంగా ఉత్పత్తి మూలాన్ని గుర్తించవచ్చు. శాకాహార మూలానికి చెందిన ఉత్పత్తుల ప్యాకేజింగ్పై ఆకుపచ్చ రంగు ఉంటుంది. మాంసాహార మూలానికి చెందిన ఉత్పత్తులకు ఎరుపు లేదా గోధుడు రంగు గుర్తు ఉంటుంది. ఈ గుర్తును ప్యాకేజీ పైభాగంలో ఉంచాలి.ఇప్పటివరకు సబ్బులు, షాంపూలు, టూత్పేస్టుల తయారీలో ఉ పయోగించే పదార్థాల మూలాన్ని తెలుసుకోవాలంటే వినియోగదారులు ప్యాకేజింగ్పై ఉన్న పదార్థాల జాబితాను పరిశీలించాల్సి వచ్చేది కొత్త నిబంధన ప్రకారం, రంగు గుర్తులతో ఉత్పత్తి శాకాహార మూలానికి చెందినదా, మాంసాహార మూలానికి చెందినదా అనే విషయాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.















