EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇంటి ముంగిటకే మీసేవ సర్వీసులు

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 23:

__________________________________

ఇంటి ముంగిటకే మీసేవ సర్వీసులు పేరిట డోర్ డెలివరీ సర్వీసెస్‌కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలంగాణ మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు,మాజీ మునిసిపల్ కెమిషనర్ ఎల్.తాజ్ మొహన్ రెడ్డి అన్నారు. ఇంటి ముంగిటకే మీసేవ సర్వీసులు పేరిట డోర్ డెలివరీ సర్వీసెస్ ను ఆర్టీసీ కళ్యాణమండపం లో మంత్రి శ్రీదర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రిని అభినందిస్తూ తాజ్ మొహం రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు.మీసేవ పోర్టల్ ద్వారా స్లాట్‌ను బుక్‌ చేసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్‌ ఇంటి వద్దకే వస్తారు.ఇంటి వద్దనే జనన లేదా మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు ఇలా మీ సేవ ద్వారా అందించే అన్నిముఖ్యమైన పౌర సేవల డెలివరీ చేస్తారని మంత్రి వివరించారు.

Related News

Select the Topic
Scroll to Top