“సప్త సాగరాలు ధాటి” కన్నడ చిత్రం సినిమాలో హీరోయిన్ గా నటించి తన అందం, నటన తో ప్రేక్షకులను మెప్పించిన రుక్మిణి వసంత్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. రవితేజ అనుదీప్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో ఆమె ఎంపికైనట్లు చెప్పుకుంటున్నారు. అధికారిక ప్రకటన ఒకటి రెండు వారాల్లో వెలువడవచ్చని తెలుస్తోంది.




