EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జియాగూడలో విఘ్ననాథుడికి పూజలు నిర్వహించిన సినీ హీరోయిన్ మాధురీ

వర్ధమాన సినీనటి మాధురీ దీపాంకర్ జియాగూడలో సందడి చేశారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని జియాగూడ ఇందిరానగర్ లోని నల్లపోచమ్మ, ముత్యాలమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆదిజాంబవ సంక్షేమ సంఘం వారు ఏర్పాటుచేసిన వినాయక మండపాన్ని భారత రాష్ట్ర సమితి (వీఆర్ఎస్) పార్టీ కార్వాన్ నియోజకవర్గ ఇంచార్జి రాకూర్ జీవన్ సింగ్, కుల్సుంపురా పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక కుమార్, ఎస్పై వేణుగోపాల్ తో కలిసి సినీనటి మాధురీ దీపాంకర్ మండపంలోని వినాయకుడికి, ఆలయంలోని నల్లపోచమ్మ, దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ముఖ్యఅతిథులైన ఠాకూర్ జీవన్ సింగ్ను ఇన్స్పాక్టర్ అశోక్ కుమార్ను, మాధురీ దీపాంకర్లను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. మహిళా అభిమానులు మాధురీ దీపాంకకు శాలువాతో పాటు తలపై పడీ పెట్టి మరీ సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ సింగ్, సీఐ అశోక్ కుమార్, మాధురీ దీపాంకర్లు మాట్లాడుతూ జియాగూడ ప్రజలకు వినాయక ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా రాబోయే సామూహిక వినాయక నిమజ్జనోత్సవాలను కూడా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు, మహిళలు, యువత వర్ధమాన సినీ హీరోయిన్ మాధురీ దీపాంకర్తో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. “ఈ కార్యక్రమంలో ఆదిజాంబవ సంక్షేమ సంఘం ప్రముఖులు, ఉత్సవ నిర్వాహకులు టి.యాదయ్య, ఎమ్ రఘునాథ్, ఎమ్ కిషన్, ఎమ్. బాలకృష్ణ, జి.చెన్నయ్య, పి.వెంకటేశ్, ఎమ్ వెంకటేశ్, పల ప్రేమకుమార్, సంతోష్ ఆదిజాంబవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్ కేశవ్, ప్రధానకార్యదర్శి సురేష్, కోశానికారి శివకుమార్, రాజేష్ పహిల్వాన్, స్థానిక యువకులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top