పెళ్లి చేయడం, ఇల్లు కట్టడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు అన్నది అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు పెళ్లి నిజంగానే ఒక సామాజిక సమస్యగా మారింది . కూతురు కోసం తండ్రి కొడుకు కోసం తల్లి చూడని సంబంధాలు లేవు . కానీ చాలా మంది అబ్బాయిలు పెళ్లి కాకుండా మిగిలిపోతున్నారు. వీరికి మంచి చదువు ఉంది. ఉద్యోగం ఉంది. సంపాదించే తెలివి ఉంది కానీ అమ్మాయిల తల్లిదండ్రుల కోరికలు అబ్బాయిల పెళ్లికి ఆటంకంగా నిలుస్తున్నాయి . ప్రతి ఒక్కరూ అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి .నగరంలో గాని పట్టణంలో గాని ఊర్లో అయినా ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది ? అన్ని లక్షలు సంపాదించి ఇల్లు కట్టేసరికి అబ్బాయి వయసు దాటిపోతుంది. ఇది పేరెంట్స్ గమనించడం లేదు . అమ్మాయిల డిమాండ్ ను సైతం అలాగే ఉన్నాయి .ఎంత ప్యాకేజీ ఉంది అన్నది వారి మొదటి ప్రశ్న. రెండోది సింగిల్ ఫ్యామిలీ . ఇక మూడవది సొంత ఇల్లు. ఇలా తమ కోరికలతో ముందు వచ్చిన పెళ్లి సంబంధాలను వదులుకొని చివరికి ఏదో ఒక సంబంధం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఆలస్యంగా జరిగినపెళ్లి తర్వాత కాలంలో పలు సమస్యలకు కారణం అవుతుంది. అది ఆర్థికంగా కావచ్చు లేక శారీరికంగా కావచ్చు .పెళ్లి ఖర్చు సైతం అబ్బాయిలను సైతం భయపెడుతోంది. ఇలా అయితే వారి సంసారం నిజంగా ఆనందాలకు నిలయంగా మారుతుందా ? చిన్న చిన్న విషయాలకి సంపాదన విషయంలో తగాదా గడిపే జీవితం సుఖాన్నిస్తుందా ? ఆలోచించండి ఒక్కసారి .
పెళ్లికి ఆర్థిక సంబంధాలకు ముడిపెడితే ఒక విధంగా నష్టమే జరుగుతుంది .పెళ్లి జరిగిన తర్వాత ఆ జంట పేదవారయినా సరే కష్టపడి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంపాదించుకుంటారు .దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్ళీడు కు వచ్చిన వెంటనే పెళ్ళి చేయండి. అప్పుడే వారికి బరువు భాద్యతలు తెలుస్తాయి…




