ఈతరం భారతం పత్రికలు , పుస్తకాలు:
లావణ్య గంగుల సంకలనం చేసిన భారత రాజ్యాంగం టైటిల్ తో వచ్చిన 98 పేజీల పుస్తకం సాధారణ పాఠకులకు అర్థమయ్యేలా ఎన్నో ముఖ్యమైన విషయాలను వివరించింది. ఈ పుస్తకాన్ని సంఘమిత్ర పబ్లికేషన్స్ ప్రచురించింది.
ఈ పుస్తకం సామాన్య పౌరులకు రాజ్యాంగంపై కనీస అవగాహన పెంపొందించే లక్ష్యంతో రాశారు . న్యాయ శాస్త్ర విద్యార్థులకు ఒక చిన్న హ్యాండ్ బుక్కు లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇందులో రాజ్యాంగంలోని పూర్తి ఆర్టికల్స్ సులభమైన పద్ధతిలో పొందుపరిచారు. భారత రాజ్యాంగం పుస్తకంలో మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్నాయి. కాగా ఇందులో 1949 సంవత్సరంలో నవంబర్ 25వ తేదీన భారత రాజ్యాంగ ముసాయిదా తుది ప్రతి సమర్పిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన చారిత్రాత్మక ప్రసంగం ఇవ్వడం ఈ పుస్తకం ప్రత్యేకత. కాపీలు కావలసినవారు 9348009227 ఫోన్ నెంబర్ లో సంప్రదించవచ్చు.














