ఈతరం భారతం వార్తాంశం
మన జాతి ఆణిముత్యం పండుగ సాయన్న.ఉమ్మడి పాలమూరు (ఉమ్మడి మహబూబ్ నగర్) జిల్లా ప్రజల రియల్ హీరో పండుగ సాయన్న మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట్ మండలం మెరుగోని పల్లె లో ముదిరాజ్ (తెలుగు )సామజిక వర్గానికిచెందినసాయమ్మ,అనంతయ్యదంపతులకుజన్మించారు.
1650 నుంచి 1707 మధ్య కాలానికి చెందిన పండుగ సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపే వాడట. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడు.పేదలను హింసించే వారు ఎంతటి వారైనా తిరగబడే మనసత్వం ఆయన లోని దైర్యానికి నిదర్శనం. నిజాం కాలంలో చిన్న, సన్నకారు రైతులు పండించిన పంటలను దోచుకుంటున్న దొరలు, దేశుముఖ్ లు, రజాకారుల కు ఎదురోడ్డి పోరాటం చేసి వారి గాదెలలోనిల్వ ఉన్న ధాన్యాన్ని నిరుపేద రైతులకు పేదలకు పంచి వారి ఆకలిని తీర్చే వాడు. పేద రైతుల భూ పత్రాలను తాకట్టు పెట్టుకొని చక్ర వడ్డీ లు వసూలు చేస్తూ వారి పొలం లోనే వారితో ఊడిగం చేయించుకోవడం గిట్టని పండుగ సాయన్న ఆ నాటి నిరంకుశ నిజాం అధికారులను ఎదురించి పోరాడి దున్నే వాడికే భూమి మీద హక్కు ఉండాలని భూ స్వాముల ఇనపెట్టెలను పగులగొట్టి అప్పు పత్రాలను చించి వేసి రైతులకు భూ పత్రాలను ఇచ్చి అండగా ఉండేవారు.కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆకలి కి అలమటిస్తున్న పేదల ఆకలి ని తీర్చడానికి భూ స్వాములు,దొరల గడిలను బద్దలు కొట్టి నిల్వ ఉంచిన ధాన్యాన్ని కొల్లగొట్టి తెచ్చి పేదలకు పంచి ఆకలి ని తీర్చడం గిట్టని వారు పండుగ సాయన్న ను బందీ పోటుగా చిత్రీకరించారు.
ఆనాడు గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూస్వాముల దగ్గర వంగివంగి నడవాల్సి వచ్చేది. వూర్లో పెత్తందార్లకు ఎదురుతిరిగి మాట్లాడేవారు కాదు. ఈ పరిస్థితులను చూసిన పండుగ సాయన్న ప్రజర్విల్లాడు. ఆయనలో విప్లవాగ్నులు చెలరేగాయి. ఈ స్థితిని మార్చాలన్న తలంపు ఆయనలో పెరిగింది. ఎదిరించటానికి సాయుధుడయ్యాడు. సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
స్వంతంగా ఆయుధాలను కూడా తయారు చేసుకున్నాడు .ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసే క్రమంలో ప్రజలను చైతన్యపరచాడు. బహుజనులపై ఏ వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో గుర్తించి దాన్ని ఎదుర్కొనటానికి జ్ఞానమనే చదువు కావాలని చదువుకున్నాడు. బహుజన వర్గాలు చదువుకోవాలన్న సందేశం ఇచ్చాడు.ఆ రోజుల్లో పేదల పెళ్ళిళ్లు జరగాలంటే చాలా కష్టంగా ఉండేది. వారికీ అండగా నిలబడి ధన, దాన్యాలు సహాయం చేసి ఆదుకునే వాడు.క్రమంగా పండుగ సాయన్న పేరు చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించింది.
అతనిని పట్టుకోవడానికి దొరలు ప్రయత్నించిన ప్రతి సారి తప్పించుకొని వారికి చుక్కలు చూపించేవాడు.సాయన్నను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్న భూ స్వాములు, పెత్తందారులు నిజాం సైన్య సహకారం కోరారు, పండుగ సాయన్న అనుచరులలో ఒకరిని బందించి ఆయన ఉండే స్థావరాన్ని తెలుసుకొని ఆయనను బందించి ప్రాణాలు తీశారు. నాటి కాలమాన పరిస్థితులలో వెనక బడిన కులానికి చెందిన ఒక వ్యక్తి దొరలకుఎదురువెళ్ళడమేఅసాధ్యం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన తిరుగు బహుట ఎగుర వేసిన మహనీయుడు మహనీయుడు మన పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్ గా ప్రఖ్యాతి గాంచారు, పీడన, దోపిడీ, వివక్ష ను రూపు మాపడానికి 17 శతాబ్దంలోనే బీజం వేసిన మన జాతి ఆణిముత్యం, బీసీలుసంఘటి తమై పండుగ సాయన్నను ఆదర్శంగా తీసుకొని రాజ్యాధికార సాధనకై పోరాడాలి.
వ్యాస కర్త: బూర్గుపల్లి కృష్ణ యాదవ్ MA
బీసీ జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు,సెల్, 9866170384














