EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ట్రంప్-జిన్‌పింగ్ భేటీ: సమావేశంలో ఏం తేల్చారు?

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ సెప్టెంబర్ 25

_____________________________________

వైట్‌హౌస్‌లో అత్యంత ఘనంగా జరిగిన అధికారిక విందులో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. అయితే, అత్యవసర సమస్యల పరిష్కారంపై ఎలాంటి పురోగతి కనిపించలేదు.కృత్రిమ మేధ ‘మానవుల నియంత్రణలోనే’ ఉండేలా దేశాలు చూసుకోవాలని, ‘బాధ్యతాయుతమైన ప్రధాన దేశాలుగా’ వ్యవహరించాలని జిన్‌పింగ్ నొక్కిచెప్పారు.రెండు దేశాలకు ‘సామరస్యం, శాంతి, విజయాలతో’ కూడిన భవిష్యత్తు ఉండాలని ట్రంప్ ఆకాంక్షించారు.దౌత్యపరమైన మర్యాదలు పాటించినప్పటికీ, తైవాన్ విషయంతో సహా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్వయంప్రతిపత్తి గల ఆ ద్వీపం తమదేనని బీజింగ్ వాదిస్తోంది.

ట్రంప్ ఇటీవల ఒక భారీ ఆయుధ ప్యాకేజీని నిలిపివేసిన నేపథ్యంలో తైవాన్ పట్ల ‘సరైన వైఖరి’ అవలంబించాలని అదే రోజు ఉదయం ట్రంప్‌ను జిన్‌పింగ్ కోరారు.ఈ విందులో కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు, ట్రంప్ ప్రభుత్వ అధికారులు, అమెరికన్ టెక్ కంపెనీల సీఈఓలు అతిథులుగా పాల్గొన్నారు.

అయితే, వారు అక్కడికి చేరుకుంటున్న సమయంలో బయట ఆందోళనకారులు గట్టిగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వారిలో కొందరిని అరెస్టు చేశారు.గురువారం రాత్రి అక్కడికి విచ్చేసిన వారిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. సుదూర ప్రయాణం చేసి అమెరికాకు వచ్చినందుకు జిన్‌పింగ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, తమ ఇద్దరి మధ్య బంధం దృఢంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top