రెక్క ఆడితే కాని డొక్కాఆ డని చేనేత బ్రతుకులు
చేనేత కార్మికులను నిరాశ పరుస్తున్న బ్యాంక్ అధికారులు
వెంటనే ట్రిప్ట్ ఫ్ఫండ్ నుంచి రావాల్సిన డబ్బును రిలీజ్ చేయాలి
జోగులంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్
జోగులంబ గద్వాల సెప్టెంబర్ 13 (ఈతరం భారతం);రెక్క ఆడితే కాని డొక్కాఆ డని చేనేత చేనేత కార్మికులను బ్యాంక్ అధికారులు నిరాశ పరుస్తున్నారని జోగులంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేసారు. చేనేత కార్మికులు ఎంతో కష్టపడి చేనేత కూలీ చేస్తూ చేనేత మగ్గంలను నడుపుకుంటూ జీవితం గడుపుతు వారి జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులు, వారి సంపాదనలో కొంత భాగం ట్రిప్టు ఫండ్ ,RD.1. ఖాతాలో జమ చేశారన్నారు. చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను గమనించి వారిని ఆదుకోవాలని తలంపుతో ప్రభుత్వం ద్వారా రావలసిన 11 నెలల బకాయిలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెనువెంటనే స్పందించి రాష్ట్ర చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వ ద్వారా ఉన్న 11 నెలల బకాయిలను రిలీజ్ చేశారు . జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం 4 కోట్ల 75 లక్షల చెక్కును 3200 మంది లబ్ధిదారులకు అందాల్సిన చెక్కును మన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా గద్వాలలో ఉన్న బ్యాంకు అధికారులకు ఈ నెల 2 తేదీన అధికారికంగా పంపిణీ చేశారు. ఆయా బ్యాంకు అధికారులు కార్మికుల ట్రిప్టు ఫండ్ RD, 2 ఖాతాలో జమ కావలసిన 11 నెలల బకాయిలను జమ చేసి పూర్తి చేశారు .కానీ చేనేత అధికారులు మాత్రం చేనేత కార్మికులకు అందాల్సిన ట్రిప్ట్ ఫ్ఫండ్ నుంచి రావాల్సిన డబ్బును ఇంతవరకు రిలీజ్ చేయకుండా కార్మికులను నిరాశ పరుస్తున్నారని విమర్శించారు. జిల్లా చేనేత అధికారులు ఎందువల్ల చేనేత కార్మికులకు త్రిఫ్టు ఫండ్ నుంచి వచ్చే డబ్బులను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారో చేనేత కార్మికులకు తెలియడం లేదు ,జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ మరియు గద్వాల ఎమ్మెల్యే మరియు అలంపూర్ ఎమ్మెల్యే ఈ విషయంపై దృష్టి సారించి కార్మికులకు రావాల్సిన ట్రిప్టు ఫండ్ నుంచి అందాల్సిన జమ రూపాయలను చేనేత లబ్ధిదారులకు వెంటనే అందేటట్లు చూడాలని తట్టే మహేష్ డిమాండ్ చేసారు.














