EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆదిలాబాద్ దేవాదాయశాఖలో తొలిసారి ధర్మవాణి

ఈతరం భారతం  ఆదిలాబాద్ మే 18

జిల్లా కేంద్రంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో సోమవారం తొలిసారిగా ధర్మవాణి నిర్వహించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుగూరి నవీన్ కుమార్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్చకులు, దేవాలయ సిబ్బంది తమ సమస్యలను ఈ ధర్మవాణిలో విన్నవించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం ఈ ధర్మవాణి ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top