ఈతరం భారతం హైదరాబాద్, (ఎల్‌బీ నగర్) జులై 24;
ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నేడు ఎల్‌బీ నగర్‌లోని ఆనాథ విద్యార్థి గృహంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా 5,000 నోట్‌బుక్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించి, వారి చదువుకు ప్రోత్సాహం కల్పించారు. విద్య ప్రతి చిన్నారి హక్కు అనే భావనతో సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మరియు అనాథ విద్యార్థులకు చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం కావాలంటే సమాజం మొత్తం కలిసి వారికి అండగా నిలవాలని, విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా విస్తృతంగా కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఆనాథ విద్యార్థి గృహం యాజమాన్యానికి, దాతలకు, వాలంటీర్లకు మరియు సొసైటీ సభ్యులకు సొసైటీ ఎక్సగ్యుటీ డైరెక్టర్ జి.మాధవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.















