ఈతరం భారతం ఆదిలాబాద్ కలెక్టరేట్ మే 16
ఇటీవల దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం పలువురిని ఆలోచిం చేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో ప్రజలు మమేకమవుతున్నారు. ఇంధన వినియోగానికి బదులు పౌరశక్తి, పవనశక్తి, విద్యుత్ శక్తి లాంటి ప్రత్యామ్ న్యాయాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి ఇంధనం అవసరం లేని వాహనాలను ఉపయోగించడానికి సమాయత్తమవుతున్నారు
ఇంధన పొదుపు పాటించాలని, వాహన వినియోగం తగ్గించాలన్న ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు శాసనసభపక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్‌శంకర్ సైకిల్ తొక్కారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన సైకిల్‌పై సవారీ చేశారు. తన అనుచరులూ సైకిల్‌పై ప్రయాణించారు. ఇకపై వార్డుల సందర్శనకు వాహన శ్రేణికి బదులు సైకిళ్లను వినియోగిస్తానని, ప్రజలు ఇంధన పొదుపు పాటించి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆయన వెంట భాజపా జిల్లా అధ్యక్షులు బ్రహ్మానందం, నాయకులు జోగు రవి, జ్యోతి, భూమా రెడ్డి తదితరులు ఉన్నారు














