ఈతరం భారతం అదిలాబాద్ ఏప్రిల్ 6
తెలంగాణ జిల్లాల హద్దుల మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2029 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల హద్దులు మార్చొద్దని సూచించిందని తెలిపారు. కేంద్రం ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ప్రజల కోరిక మేరకు మార్పులు చేపడతామని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం తుమ్మడిహట్టి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి ఆదిలాబాద్‌కు అన్యాయం చేసిందని సీఎం విమర్శించారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించి గోదావరి నీటిని జిల్లాకు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్‌లో త్వరలోనే ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు.














