ఈతరంభారతం బూర్గంపాడు: జూన్ 16
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీలలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులనుఅన్ పట్టుకున్నారు.ఒడిశా రాష్ట్రం నుండి ములుగు జిల్లా మంగపేట మండలానికి బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌పై గంజాయిని తరలిస్తుండగా, బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడిన వ్యక్తుల వద్ద నుండి సుమారు రూ.1,05,000 విలువైన 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వ్యక్తులు:
బడే భరత్ (20 సంవత్సరాలు)
ఉప్పరపల్లి వెంకటేష్ (26 సంవత్సరాలు)
చిరునామా: మంగపేట మండలం, ములుగు జిల్లా.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
2.1 కిలోల గంజాయి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు.
నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.















