EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఘనంగా ముగిసిన బాల సంస్కార్ -2026 వేసవి శిభిరం

ఈతరం భారతం హన్మకొండ మే 25:

బాల సంస్కార్ -2026 వేసవి శిభిరం ముగింపు వేడుక జయప్రదం.శ్రీ రామకృష్ణ సేవ సమితి హనుమకొండ ఆధ్వర్యంలో నిర్వహించబడిన బాలసంస్కార్ – 2026 నేడు ముగింపు వేడుకతో జయప్రదమైంది. నేటి మాతృ పితృ పాదపూజ మహోత్సవంలో చిన్నారులు నేర్చుకున్న యోగ-ధ్యానం, సాంస్కృతిక ప్రదర్శనలు, సంస్కృత భాష అధ్యయనం,శ్లోక గీతి తదితర అంశాలను సూక్ష్మంగా ప్రదర్శించడం జరిగింది. సమితి అధ్యక్షులు కటంగురు సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు చైతన్య సంస్కృత అధ్యాపకులు పేట శ్రీనివాస్ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో నేటి వేడుక ప్రారంభమైంది.

నాయిని విశాల్ ట్రస్ట్ ధర్మకర్త దేవన విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక అతిథిగా విచ్చేసి వివేకానంద నాబోటి యువతకు స్ఫూర్తి ప్రదాత యని, వారిని ఆదర్శంగా తీసుకున్న బాల-బాలికలు జీవితంలో తప్పకుండా విజయం సాధిస్తారని, చిన్నారుల విన్యాసాలు, ప్రదర్శించిన అంశాలు మనసుకు ఆకట్టుకునేలా ఉన్నాయని అన్నారు.

పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర గూర్చి ప్రముఖ మానసిక నిపుణులు శివప్రసాద్ గారు ప్రధాన వక్తగా హాజరై పిల్లల పోషకులకు మార్గదర్శనం చేశారు. సమితి ఆశయాలను కార్యక్రమాలను వాటి నిర్వహణ ఆవశ్యకత గురించి అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి వివరించారు. ప్రభు చైతన్య మాట్లాడుతూ పిల్లల్లో సంస్కారాలు నింపాలంటే తల్లి ఒక భక్తురాలిగా తండ్రి ఒక యోగిలా గురువు ఒక జ్ఞానిలా ఉన్నప్పుడే పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దగలరని అన్నారు. నేడు సాహితీ-సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన విజేతలకు, ప్రదర్శనలు చేసిన చిన్నారులకు జ్ఞాపికలను, మూర్తిత్రయ భావజాల సాహిత్యాన్నిబహుకరించారు. సేవా సమితి క్రియాశీల సభ్యులు చిదర అంజనీ దేవి, పడిదల అనిత, పూలమ్మ, లక్ష్మిదేవి, లక్ష్మి రావు, కె.వి.రావు, సూర్య, కార్యకర్తలు అనిల్, రఘు, నరేష్ శ్రీకాంత్, గణేష్, పిల్లల తల్లి-తండు)లు, తదితర పరిసర కాలనీల వాసులు సుమారు 250 మంది ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. చివరగా ప్రసాద పంపిణీ జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top