EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రతి వ్యక్తి ఇష్టంతోనే అనుకున్న లక్ష్యాలు సాధించగలడు

ఈతరం భారతం హన్మకొండ మే 18:

ప్రతి వ్యక్తి ఇష్టంతోనే అనుకున్న లక్ష్యాలు సాధించగలడనిఅసాధ్యం అనిపించిన పని పైన దృష్టిని కేంధ్రీకరిస్తే, ఆ పని సుసాధ్యం అవుతుందని చెస్ గ్రాండ్ మాస్టర్ అవార్డు గ్రహీత ‘అర్జున్ ఎరిగైసి’ అన్నారు.శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో బాల సంస్కార్-2026 వేసవి శిక్షణ శిభిరానికి  మూడవ రోజు విశిష్ఠ అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి  ప్రసంగించారు.

జీవితంలో ఏదైనా సాధించాలి అంటే, ముందుగా చేసే పనిని ఇష్టంతో ప్రారంభించాలని, ఏ పనినైతే ఇష్టపడతామో, ఆ పని కష్టంగా అనిపించదని తెలిపారు. అసాధ్యం అనిపించిన పని పైన దృష్టిని కేంద్రీకరిస్తే, ఆ పని సుసాధ్యం అవుతుందని, జీవితంలో గెలుపు, ఓటములను సమ దృష్టితోస్వీకరించాలన్నారు.

అనంతరం సేవా సమితి అధ్యక్షులు కటంగూరిసత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూచాలా చిన్న వయసులో ‘అర్జున్ ఎరిగైసీ’ మరెందరో విద్యార్థులకు ఆదర్శమని, భవిష్యత్తరాలకు స్పూర్తిదాయకమని అన్నారు.మన చారిత్రక ఓరుగల్లు గడ్డ యువ కెరటం, పిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో చెస్ గ్రాండ్ మాస్టర్ అవార్డు గ్రహీత ‘అర్జున్ ఎరిగైసి’ తన సందేశంలో ప్రతి వ్యక్తి ఇష్టంతోనే అనుకున్న లక్ష్యాలు సాధించగలడని అన్నారు.

ఈ సంవత్సరం నుండి ఏదైనా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను, వివేక్ పురస్కారాన్ని అందచేస్తున్నట్లు, మరియు ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రభు చైతన్య సంయుక్తంగా ప్రకటించారు. ఇటీవల చదరంగంలో భారత కీర్తి-ప్రతిష్టలను ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేసిన, చదరంగం గ్రాండ్ మాస్టర్ ‘అర్జున్ ఎరిగైసీ’కు ఈ ఏడాది-2026 “వివేక్ పురస్కార్-2026” మెమెంటోను, మెడల్ ను బహుకరించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. చాలా చిన్న వయసులో ‘అర్జున్ ఎరిగైసీ’ మరెందరో విద్యార్థులకు ఆదర్శమని, భవిష్యత్తరాలకు స్పూర్తిదాయకమని అందుకే ఈ శిభిరంలో పాల్గొన్నబాల-బాలికలకు స్ఫూర్తిని కల్గించే లక్ష్యంతో మా ఆహ్వానాన్ని స్వీకరించి, చెస్ గ్రాండ్ మాస్టర్ ‘అర్జున్ ఎరిగైసీ’ ఈ శిభిరాన్ని సందర్శించడం హనుమకొండ వాసులుగా గర్వ పడుతున్నామని సేవా సమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి క్రియాశీలక సభ్యులు చిదర అంజనీ దేవి, పడిదల అనిత, లక్ష్మీ రావు, కె.సరోజనమ్మ, లక్ష్మిదేవి, వీణ, చిర్ర సరోజన, కె. సూర్య, కె.వి.రావు, పేట శ్రీనివాస్, అనిల్, అరుణ్, రఘు, భాస్కర్, నరేష్, శ్రీకాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top