EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శారీరకంగా, మానసికంగా, బాగా బలిష్టంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి      హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షులు స్వామి బోధమయానంద 

హనుమకొండ ఆగస్టు 21 (ఈతరం భారతం);శారీరకంగా, మానసికంగా, బాగా బలిష్టంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షులు స్వామి బోధమయానంద అన్నారు.భవిష్యత్ తరాల బాల బాలికలు నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించుకోవాలి ? అనే అంశంపై “సెమినార్” హనుమకొండ శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దీనిలో ముఖ్య అతిథి హైదరాబాద్ రామకృష్ణ మఠ్ అధ్యక్షులు స్వామి బోధమయానందజీ ప్రధాన వక్తగా భవిష్యత్ తరాల పిల్లలు నైతిక విలువలతో కూడిన వారి వ్యక్తిత్వ వికాసం, సర్వతోముఖాభివృద్ధి సభ్య సమాజానికి, దేశ పురోగమనానికి ఎలా దోహదపడుతుందో పలు ఉదాహరణలతో తమ సందేశంలో తెలియ జేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, పిల్లలలో, ఉపాధ్యాయులలో ఆత్మవిశ్వాసము, ఆత్మ నిబ్బరం, దేశభక్తి మొదలైన విషయాల గురించి విశదీకరించారు. ప్రతి విద్యార్థి స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఒక సింహం వలె తయారవ్వాలని శారీరకంగా, మానసికంగా, బాగా బలిష్టంగా ఉన్నప్పుడే దేశం బాగా అభివృద్ధి చెందుతుందని స్వామి బోధమయానంద ఉద్ఘాటించారు. వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ బాధ్యులు సూర్యప్రకాష్ భవిష్యత్ తరాలకు వివేకానంద బోధనలను అవగాహన కల్పించినట్లు తమ సంస్థ కృషిని వివరించారు. లక్షణాచారి గారు మాట్లాడుతూ, పిల్లలు స్వామి వివేకానంద బోధనలను అనుసరించాలని వారు నడిచిన మార్గంలో నడిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని, ఎటువంటి అపోహలకి, అపశృతులకు తావీయకుండా, అవమానాలకి గురికాకుండా, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగాలని తెలియజేశారు. హడుప్సా ప్రధాన కార్యదర్శి మాడుగుల సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు సెమినార్ లో పాల్గొనడం మా పిల్లల అదృష్టంగా ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. కార్యక్రమంలో శారద విద్యానికేతన్ వరంగల్ కరస్పాండెంట్ మరియు సేవా సమితి ఆదర్శ ధర్మకర్త శ్రీ సురేష్ గారు రామకృష్ణ సేవా సమితి భవన నిర్మాణానికి స్వామి బోధమయానందజీ సమక్షంలో మరో 50 వేల రూపాయల చెక్కును విరాళంగా అందజేసి విశిష్ట ధర్మకర్త గా ఇవ్వబడిన దాతృత్వం ప్రశంసనీయమైందని సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో భారత్ వికాస్ పరిషత్ సభ్యులు స్వామి వివేకానంద పోస్టర్ని ఆవిష్కరించారు. హాజరైన విద్యార్థిని విద్యార్థులందరికీ స్వామి వివేకానంద పుస్తకాలతో పాటు వివేకానంద పోస్టర్ని కూడా బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో “హడుప్స” సభ్య విద్యాసంస్థల ప్రిన్సిపల్స్ కరస్పాండెన్స్, రామా రావు, వెంకట్ రెడ్డి, వెంకటరమణ తదితర ఉపాధ్యాయులు మరియు 8 నుండి 10 తరగతులకు చెందిన బాలబాలికలు దాదాపు 1200 మంది పాల్గొన్నారు. సేవా సమితి బాధ్యులు శ్రీనివాస స్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, కేవి రావు, సూర్య, అరుణ్, విష్ణు, భద్ర, స్వరూప, అంజనీ దేవి, సరోజనమ్మ, లక్ష్మీ రావు, పార్వతి తదితరులు పాల్గొన్నారు. అయితే సెమినార్ ప్రారంభంలో సేవా సమితి సీనియర్ సభ్యులు కీ. శే. ప్రభాకర్ యాదవ్ గారి ఆకస్మిక మరణానికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.

Related News

Select the Topic
Scroll to Top